పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎంపి రావుల
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ జె.ఏ.సి ఛైర్మెన్ ఎం.వేణు గోపాల్ కుమారుడు సాయికృష్ణ వివాహం సవితతో జరిగింది.నూతన వధూవరులను రావుల చంద్రశేఖరరెడ్డి ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మారం.బాలకృష్ణ,సతీష్ గార్ల సోదరుడు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. గుంజి హమాలీ సోదరులు కోట మశమ్మ పండుగ చేసిన సందర్భంగా విందు కార్యక్రమములో పాల్గొని అధ్యక్షులను కార్మికులను సన్మానించారు.
రావుల చంద్రశేఖరరెడ్డి వెంట వాకిటి.శ్రీధర్,మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,నందిమల్ల.అశోక్,ఉంగ్లం.తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,యాదయ్య, బాలయ్య,ముద్దుసార్ తదితరులు పాల్గొన్నారు. (Story : పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎంపి రావుల)