కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా శుక్రవారం వినుకొండ డిపో గ్యారేజీ గేటు ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి డిపో గౌరవ అధ్యక్షులు ఆర్. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కమిటీ చైర్మన్ పి వి ఎస్.ఆర్ మూర్తి మాట్లాడుతూ. ఆర్టీసీలో చాలామంది ఉద్యోగులు 50 ఏళ్లు పైబడిన వారని వారికి సరైన వైద్యం అందడం లేదని, పెండింగ్ డిఏలు ఇంతవరకు చెల్లించలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు సూపర్ లగ్జరీలో ప్రయాణం అనుమతించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భత్యం పెంచాలని, 1/2019 సర్కులర్ అమలు పరచాలని, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ పనిష్మెంట్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పై సమస్యలు పరిష్కరించని యెడల అవసరమైతే సమ్మెకు దిగుతామని డిపో అధ్యక్షులు సౌభాగ్యరాజు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వి.ఎస్.పి నాయక్, ముప్పాళ్ళ శ్రీను, వైవి ఆంజనేయులు, కె.ఆ దెయ్య, హరిహర బాబు, కఠారి, డిఎస్, శేషగిరి ,గ్యాస్ వలి ,ఎం.కే , జి ఎన్ రావు,కె. ఎస్.ఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.(Story : కార్మికుల సమస్యలు పరిష్కరించాలి)
