Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మహాత్మ జ్యోతిరావు పూలేకు సిపిఐ  ఘననివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలేకు సిపిఐ  ఘననివాళులు

0

మహాత్మ జ్యోతిరావు పూలేకు సిపిఐ  ఘననివాళులు

న్యూస్ తెలుగు / వినుకొండ : మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక కార్యకర్త కుల వ్యతిరేక సామాజిక సంఘసంస్కర్త అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు. శుక్రవారం నాడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శివయ్య స్తూపం సెంటర్ లో పూలే జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన పూలే ఆనాటి కుల వ్యవస్థలో అంటరానితనం మరియు కుల నిర్మూలన బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం మహిళలకు విద్యను అందించడంలో సొంత బడులు విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని బడుగు వర్గాలకు విద్యను అందించుచు అనేక విమర్శలు ఎదుర్కొని పేద బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నారని చివరకు జ్యోతిరావు పూలేను శూద్రుడని స్నేహితుల పెళ్లిళ్లకు కూడా రాకుండా బహిష్కరణలను సైతం ఆయన ఎదుర్కొన్నారని అన్నారు. మహారాష్ట్రలో 1888లో సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని సంస్కృతంలో గౌరవార్థకమైన “మహాత్మ” అనగా గౌరవనీయుడు అను బిరుదుతో మహాత్మ జ్యోతిరావు పూలే అని సత్కరించబడ్డారని మహాత్మ ఫూలే థామస్ ఫైన్ రాసినటువంటి ‘రైట్స్ ఆఫ్ మ్యాన్’ పుస్తకాన్ని చదివి సామాజిక న్యాయం పట్ల తీవ్రమైన భావాన్ని పెంచుకొని భారతీయ సమాజంలో దోపిడీకి గురైన కులాలు మరియు మహిళలు తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారని గ్రహించి ఈ వర్గాలకు విద్య, విముక్తి సామాజిక న్యాయం చాలా ముఖ్యమైనదని ఆయన గ్రహించి వారి ప్రయోజనం కోసం తన భార్య సావిత్రి బాయికి చదవడం మరియు వ్రాయడం నేర్పించారని ఆ జంట పూణేలో మొదటి స్వదేశీ బాలికల పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ఈ సందర్భంగా అభ్యుదయవాదులు యూరోపియన్లు అతనికి ఉదారంగా సహాయం చేశారన్నారు. పూణేలో నివసిస్తున్న తన కుటుంబాన్ని మరియు సమాజాన్ని బహిష్కరించమని సాంప్రదాయవాదులు బలవంతం చేశారని ఆ కాలంలో వారి స్నేహితుడు ఉస్మాన్ షేక్ మరియు అతని సోదరి ఫాతిమా షేక్ వారికి ఆశ్రయం కల్పించారని ఆయన అన్నారు. వారు తమ ప్రాంగణంలో పాఠశాలను ప్రారంభించడానికి కూడా సహాయపడ్డారని తర్వాత పూలే మహార్ మరియు మాంగ్ వంటి అప్పటి అంటరాని కులాల పిల్లల కోసం పాఠశాలలను ప్రారంభించారని 1852లో మూడు పూలే పాఠశాలలు అమలులో ఉన్నాయని బాలురు బాలికలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తునారని ఆనాటి ప్రభుత్వాలు ఆ స్కూళ్ళను అన్నిటిని మూసి వేయించారని తీవ్రంగా విమర్శించారు. ఆనాటి పరిస్థితుల్లో అంటరాని వారు తమ నీడలతో ఎవరినీ కలుషితం చేయడానికి అనుమతించబడరని మరియు వారు ప్రయాణించిన మార్గాన్ని తుడిచిపెట్టడానికి వారి వీపుకు చీపురు కట్టుకోవాల్సి వస్తుందని పూలే గమనించాడు. యువ వితంతువులు తలలు గుండ్లు చేయించుకొని జీవితంలో ఏ విధమైన ఆనందాన్ని పొందకుండా ఉండటం ఆయన చూశాడు అసమానతను ప్రోత్సహించే ఈ సామాజిక దురాచారాలన్నింటినీ చూడడం ద్వారా మహిళలకున్యాయం కోసం విద్యను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వితంతువుల పునర్వివాహాన్ని ఆయన సమర్థించారు. 1888లో ఆయన పక్షవాతానికి గురి అయ్యి 1890 నవంబరు 28న, 63 సంవత్సరాల వయసులో పూణేలో మరణించారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మ పూలే, సావిత్రిబాయి లాంటి సంఘసంస్కర్తలు అభ్యుదయవాదులు ఎందరో త్యాగ ధనుల ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లవలసి ఉందని తెలుపుతూ మహాత్మ పూలే కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, సోమవరపు దావీదు, మల్లవరపు రవి,కొప్పరపు మల్లికార్జున, షేక్ మస్తాన్, దారి వేముల మరియ బాబు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరావు, షేక్ కరీం, సుభాని,షేక్ ఖాసిం, సయ్యద్ నాగూర్, మేడ వీరయ్య, గురువులు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. (Story: మహాత్మ జ్యోతిరావు పూలేకు సిపిఐ  ఘననివాళులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version