మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు సన్మానం
న్యూస్ తెలుగు / వినుకొండ : శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శుక్రవారం వినుకొండ పట్టణ పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తంలో స్టేట్ బెస్ట్ మొదటి కమిషనర్ స్థానంలో 94.7 ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసిన శుభ సందర్భంగా వారికి ఎం.ఏ.యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, సి.డి.ఎం.ఏ కమిషనర్, మున్సిపల్ శాఖ పొంగూరు నారాయణ మంత్రి చేతులమీదుగా క్యాష్ ప్రైస్ కూడా వారికి రావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సాంప్రదాయ పద్ధతుల్లో వారికి స్వామి వారి ఆశీర్వాదం ఆలయ అర్చక స్వాములతో ఆశీర్వచనం చేయడం జరిగింది. ఆలయ నిత్య అన్నదాన సేవకులు జాజులమాల్యాద్రి మాట్లాడుతూ. వినుకొండ పట్టణాన్ని పరిశుభ్రంగా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చీప్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు గ్రీన్ వినుకొండగా పట్టణాన్ని సుందరీకారంగా చేస్తున్న సందర్భంగా వారిని ప్రత్యేకంగా దుశాలవలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ సేవకులు కనువాల వెంకటేశ్వర్లు, అనుముల శివకుమార్, ఏటుకూరి కృష్ణవేణి, పిడతల రమాదేవి, అనుముల తారక్, నెమలి పూరి పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు సన్మానం)
