రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..
మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
న్యూస్ తెలుగు / వినుకొండ : రాజ్యాంగాన్ని రక్షించుకొనుటకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనుటకు పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలుకొని నేటి వరకు 12 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా అమలు చేయలేదని వంద రోజులలో ధరలు తగ్గిస్తామన్నారని ఈ 11 సంవత్సరాల్లో సామాన్యులు కొనుగోలు చేసే సరుకులు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి సామాన్య ప్రజల జీవనం పెను భారమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి తిరుమల వెంకన్న సాక్షిగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని నమ్మించి మోసం చేసి న మోడీ ప్రజా వ్యతిరేక విధానాు అవలంబించినందున దేశంలో సామాన్యులు వాడుకునే నిత్యవసర సరుకుల వస్తువుల ధరలు పెట్రోలు డీజిల్ వంటగ్యాస్ విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయని, “ఏమీ కొనేటట్టు లేదు ఏమీ తినేటట్టు లేదు” అన్న చందంగా ప్రజలు విలవిలలాడిపోతున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశ సంపదలైన జీవిత బీమా ఇన్సూరెన్స్ రంగాన్ని బొగ్గు గనులను, ప్రభుత్వ బ్యాంకులను, పరిశ్రమలను మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా దానిలో భాగంగానే ఉన్నదని విశాఖ ఉక్కు పై ప్రైవేట్ పరం కాకుండా అచటి కార్మికులు ప్రజలు సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై ఆయా రాష్ట్రాలలో కేంద్రం ఆధీనంలో ఉన్న సిబిఐ, ఈడి లను ఉపయోగించి కుట్ర కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీలను ఆయా ప్రభుత్వాలలోని మంత్రులను ముఖ్య మంత్రులను భయకంపితులను చేయుచు అక్రమ కేసులతో తన పార్టీలోకి చేర్చుకొనుటకు బిజెపి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎంతటి తప్పు చేసిన ఎంతటి అవినీతి చేసిన తర్వాత జిల్లావారైనా భారతీయ జనతా పార్టీలో చేరితే ఆ తప్పులను కొట్టివేసి నీతిమంతులు అయిపోయే పరిస్థితులు వస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాశి ఏదతనకబంధహస్తాలలో అన్ని రాష్ట్రాలలో కూడా బాగా వేయుటకు ప్రతిపక్ష రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలను ఎంపీలను డబ్బు ఎరచూపి, కుట్ర కేసుల తో భయకంపితులను చేయుచు యదేచ్ఛగా నిరంకుశత్వ విధానాలు ప్రయోగిస్తున్నారని కావున రాష్ట్రంలోనూ దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో నేటికీ మైనారిటీ మతస్తుల పై వారి ఆస్తులు దేవాలయాల పై జరుగుతున్న మత దురహంకార విధానాలను వ్యతిరేకిస్తూ రైతన్నలకు నల్ల చట్టాలు రద్దుచేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధరపై చట్టం చేస్తానని రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పెరిగిన అధిక ధరలను తగ్గించాలని దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని మైనారిటీ మతస్తులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల లోనూ గ్రామీణ ప్రాంతాలలోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో సిపిఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, సోమవరపు దావీదు మల్లవరపు రవి బొప్పారావు మల్లికార్జున షేక్ మస్తాన్ దారువేముల మరీ బాబు లు వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు షేక్ కరీం షేక్ సుభాని షేక్ ఖాసిం సయ్యద్ నాగూర్ మేడ వీరయ్య గురువులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. (Story : రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..)