కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి
అభినందనలు తెలిపిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి( నారదాసు ఈశ్వర్) : హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బానోతు దుదియా నాయక్ ను సిద్దిపేట జిల్లా పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ, ఏసిపి వాసాల సతీష్ అభినందించారు, హుస్నాబాద్ పీఎస్ లో పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న దుదియా నాయక్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి రాగా ఈరోజు సీపీ కార్యాలయంలో వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కొండ్ర శ్రీనివాస్, ఎస్సై మహేష్, సహచర సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు . (Story :కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి)