సూపర్ సిక్స్ పథకాలేవీ..?
న్యూస్ తెలుగు /సాలూరు : గత వైఎస్ఆర్ ప్రభుత్వం లో బటన్ నొక్కి ప్రతి నెల సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందని,కుటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదని సాలూరు మండలం గిరిశిఖర గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు . బుధవారం ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ను ఆయన స్వగృహంలో కలిశారు వాపోయారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను తెలుపుతూ బోరున విలపించారు.గతంలో జగనన్న హయాంలో గిరిజనులకు ఆర్.ఓ.ఎఫ్ ఆర్ పట్టాలు అందజేయడమే కాకుండా మీట నొక్కి వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులను నేరుగా జమచేసి గిరిజనులను ఆదుకున్నారని తెలిపారు,ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించట్లేదని గిరిజనులు మొరపెట్టుకున్నారు.గతంలో జగనన్న చెప్పిన నవరత్నాల హామీలు అమలు చేస్తూ సమయానికి నేరుగా ప్రజలు బ్యాంక్ ఖాతాల్లో పడేవని, మేనిఫెస్టోలో నవరత్నాలు హామీలే కాకుండా అదనంగా జగనన్న వసతి దీవెన,విద్యా దీవెన,వైస్సార్ చేయూత, విద్యా కానుక,వైస్సార్ కాపు నేస్తం,వైస్సార్ వాహన మిత్ర, ఈబీసీ నేస్తం,జగనన్న చేదోడు,సున్నా వడ్డీ పధకం మొదలగు వివిధ సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన ప్రజలు వద్దకు చేరాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా నేరుగా ప్రజలకు అందలేదు కదా దాని ఊసే ఈ కూటమి ప్రభుత్వంలో చేయలేదని వారికి ఆ ధ్యాసే లేదని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజన్నదొర తోనే మేమంతా ఉంటామని గిరిజనులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోణం సర్పంచ్ మువ్వల అదియ్య ,మామిడి సర్పంచ్ పిడిక సుధా, కొట్టు పరువు సర్పంచ్ కొండ తామర నరసింహులు,, కొడమ సర్పంచ్ తాడంగి సుసుమ, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు వైసిపి నాయకులు సువ్వాడ రామకృష్ణ నెమలి పిట్ట కళ్యాణ్, బీసు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. (Story :సూపర్ సిక్స్ పథకాలేవీ..?)