బీజాపూర్ పోలీస్ అధికారుల ఎదుట లొంగి పోయిన 22 మంది మావోయిస్టులు
న్యూస్ తెలుగు/ చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతివాడ జిల్లా ల్లో ఒకపక్క వరుస ఎన్కౌంటర్ లతో ను, మరోపక్క, దిక్కుతోచని ఆదివాసి వందలాది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగి పోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు చొప్పున బతుకు తెరువు కోసం చెక్కుల పంపిణీ చేస్తున్నారు. బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులైన డిఐజి దేవేంద్ర సింగ్ నేగి, ఎస్పీ జీతేంద్రకుమార్ యాదవ్, సిఆర్పిఎఫ్ 81,85,153,168,170,196,199,222,229 దళాల కమాండెంట్లు మనీష్ కుమార్ మీనా, సునీల్ కుమార్ రాహి, అమిత్ కుమార్, విక్రమ్ సింగ్, సర్కార్ రాజా రమన్, కుమార్ మనీష్, ఆనంద్ కుమార్, వీరేంద్ర సింగ్, చందంబాబి సింగ్, కోబ్రా దళాల కమాండర్ లు 201,202,204,205,206,208,210 కమాండర్లు అమిత్ కుమార్ చౌదరి, అమిత్ కుమార్, సంతోష్ కుమార్ మల్ల, నరేష్ పవార్, పుష్పంధ్ర కుమార్, భూపణ్ సింగ్ బిస్త్, అశోక్ కుమార్ ల ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో తెలంగాణకు చెందిన స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నారు. 26 లక్షల రివార్డు కలిగిన నలుగురు మావోయిస్టులు ఉన్నారు. మిగతా వారంతా ఏరియా కమిటీ సభ్యులు క్యాడరు కలిగిన వారు ఉన్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి 50 వేల రూపాయల బ్యాంకు చెక్కులను పంపిణీ చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు స్వేచ్ఛగా బతుకువచ్చని పోలీస్ అధికారులు తెలిపారు.(Story : బీజాపూర్ పోలీస్ అధికారుల ఎదుట లొంగి పోయిన 22 మంది మావోయిస్టులు )