అక్కన్నపేటలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి ( నారదాసు ఈశ్వర్ ): శ్రీరామనవమి పర్వదినం వేడుకలను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రముతో పాటుగా అంతకపేట, కట్కూర్ ,గొల్లకుంట,తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణ వేడుకలను తిలకించారు.భక్తులు కట్నకానుకలతో పాటు ఒడిబియ్యం సీతారామ కళ్యాణం లో సమర్పించారు. అనంతరం అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాలు శ్రీరామనామ స్మరణలతో మార్మోగింది.అక్కన్నపేటలో ఆంజనేయ భక్త బృంద సభ్యులు కాశబోయిన రమేష్ జయ, గొట్టె మహేందర్ రేణుక దంపతులు స్వామి వారి కళ్యాణం జరుపగా భగత్ సింగ్ యూత్ ఆద్వర్యంలో దాతలు చిర్ర మంజుల ఐలేశ్వర్ ,చిర్ర నాగ లావణ్య శాంతి ప్రకాష్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.వేద పండితులు నాగిల్ల లక్షణమూర్తి,అంతకపేటలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాషబోయిన రవి,చందుపట్ల నాగరాజు, పడాల మల్లిఖార్జున్, కంది సుదర్శన్ రెడ్డి ఆద్వర్యంలో పవన్ శర్మ తమ వేద మంత్రాలతో వైభవంగా కళ్యాణం జరపారు . ఈ సందర్భంగా అక్కన్నపేట రాములోరి కళ్యాణ మహోత్సవంలో విశేష కృషి చేసిన భగత్ సింగ్ యూత్ సభ్యులు బూర దీపక్ గౌడ్ తో పాటుగా మిట్టపెల్లి సురేందర్ ముదిరాజ్, ఆంజనేయ భక్త బృంద సభ్యులు కాశబోయిన రమేష్, గొట్టే మహేందర్ లను మండల బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు గ్రామస్తులు, భగత్ సింగ్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఆంతకపేట రాములోరి కళ్యాణ వేడుకలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగపెల్లి ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు.( Story : శ్రీరామ నవమి ప్రత్యేక కథనం: నారదాసు ఈశ్వర్ , సిద్దీపేట జిల్లా ప్రతినిధి)