కళాకారుల సమస్యలను పరిష్కరించండి..
న్యూస్ తెలుగు / వినుకొండ : గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఐదు మండలాల కళాకారులతో శనివారం చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ర్యాలీగా నరసరావుపేట కి బయలుదేరి వెళ్లారు. కళాకారులు పడుతున్న ఇబ్బందులు, కళాధరణ లేక ఉంటానికి ఇల్లు లేక అనేక రకాల సమస్యలతో ఉన్న కళాకారులకి ప్రభుత్వం ద్వారా,అధికారుల ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వటానికి వివిధ మండలాల నుంచి వంద మంది కళాకారులు వెళ్లారు. కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి యొక్క న్యాయమైన కోరికల్ని, సమస్యల్ని పరిష్కారం చేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా సహకరిస్తున్న కళాకారులందరికీ కూడా గుమ్మడి కళా పీఠం తరపున పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. (Story : కళాకారుల సమస్యలను పరిష్కరించండి..)