ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి
60 సంవత్సరాలు నిండిన మున్సిపల్ కార్మికుల కుటుంబాల వారికి
ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల ధర్నా
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్
న్యూస్ తెలుగు/ చింతూరు: 60సంవత్సరాలు నిండిన ఆప్కాస్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను విధులలోకి రావద్దని తీసుకొచ్చిన జీవో నెంబర్ 15 రద్దు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు.
ధర్నా అనంతరం డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైనా మరణించిన రిటైర్ అయిన వారి కుటుంబీకులకే ఉద్యోగాలు సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చేవారని నేడు కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాజమండ్రి మున్సిపాలిటీ లొ 20 మంది కార్మికుల పైగా రేపటి నుంచి వీధిలోకి రావద్దని అకస్మాత్తుగా చెప్పడం దారుణం అన్నారు. ఏసీ ల్లో కూర్చునే వారికి 62 సంవత్సరాలు పెంచి రోడ్డుమీద కష్టపడి నానా చాకిరి చేస్తూ బతుకు ఈడుస్తున్న మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను మాత్రం 60 సంవత్సరాలకే కుదించడం అన్యాయం అన్నారు. మున్సిపల్ కార్మికులకు కూడా 62 సంవత్సరాలు సర్వీస్ పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చిన విధముగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని. వారి జీవితాల్లో వెలుగు నింపాలని మధు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు కూడా గ్రాడ్యుటి ఇవ్వాలని. ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి రమణ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.దుర్గమ్మ ఉపాధ్యక్షులు బంగారు గిరి అల్లం బాలు గూడుపు వెంకటగిరి బాబు పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story : ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి)