సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : సర్దార్ సర్వాయి పాపన్న గారి 315వ వర్ధంతి సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ముందు ఆయన విగ్రహాన్ని పెట్టి ముసుగు తొలగించకుండా ఉండటాన్ని నిరసిస్తూ , అక్కడే ఆయన వర్ధంతిని నిర్వహించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు. అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, వనపర్తి లో మహనీయుల విగ్రహాలపై అగ్రకులాల నాయకులచే రాజకీయ గ్రహణం ఏర్పడిందని, అందుకే B.C మహనీయుల విగ్రహాల దగ్గర రాజకీయం చేయకుండా త్వరగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రారంభం చేయాలని కోరుతూ, గౌడ అన్నలపై గౌరవంతో వారి సూచనలతో అందరూ కలిసీ విగ్రహ ప్రారంభ చేసే విధంగా పదిహేను రోజుల్లో ఏదైనా తేదీ ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు ఎస్సీ ఎస్టీ మార్నింగ్ మానిటరింగ్ మెంబర్ గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, భాస్కర్, సత్యం సాగర్, శ్రీధర్ గౌడ్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు (Story : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి)