పవిత్ర ఉపాసదీక్షల దినం రంజాన్ పండుగ
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి :పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో ముస్లిం మతపెద్దలను సోదరులను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్, ఉగాది పండుగలు ఒకేరోజు రావడం శుభసూచకం అని ఇది మతసామరస్యానికి ప్రతీకంగా నిలుస్తుందని అన్నారు. కెసిఆర్ హయాములో ముస్లిం సోదరులకు ప్రత్యేక పథకాలు రంజాన్ తోఫా,షాది ముబారక్,మైనార్టీ సంక్షేమ పథకాలు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిది అని అన్నారు. మైనార్టీ సంక్షేమ కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి అన్నారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకుడు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పి.రమేష్ గౌడ్, బండారు.కృష్ణ,ఉంగ్లం. తిరుమల్,కంచే రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి, ,నీలం స్వామి ఎండి జోహార్ హుస్సేన్ , సూర్యవంశం గిరి, చిట్యాల రాము ఇమ్రాన్ బిన్ అలీ, సునీల్ వాల్మీకి, భాషా, గులాం ఖాదర్ ఖాన్, ఏకే పాషా ,స్టార్ రహీం యుగంధర్ రెడ్డి, గాలిగల్ల క్రాంతి , బంగాలే రఘు, గాడుదుల మోహన్ , ఉల్లెం సంతోష్, తోట శ్రీను,ఖాదర్, ముని కుమార్, సాదిక్, ఖలీల్ , యూసుఫ్ , జావిద్ ,సర్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. (Story : పవిత్ర ఉపాసదీక్షల దినం రంజాన్ పండుగ)