మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ
న్యూస్‌తెలుగు/వనపర్తి : రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించి ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పర్వదినం రోజున ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని చిన్నారెడ్డి ముస్లిం సోదరులకు కోరారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కమ్మర్ మియా, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్ మియా,జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కోట్ల రవి, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు అడ్వకేటర్ కిరణ్ ,వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాగి అక్షయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏఐపిసి అధ్యక్షుడు నాగార్జున, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అనిష్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి వేణు ,మణిగిల్ల బాల్ రాజు, వేనా చారి,వెంకటేశ్వర్ రెడ్డి, చీర్ల జనార్ధన్ , ఆసిఫ్ , అబ్దుల్లా, నందిమల్ల సందీప్ , జానంపేట నాగరాజు,ముస్లిం సోదరులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ)