మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు
డి.ఎస్.పి నాగేశ్వరరావు వెల్లడి
న్యూస్ తెలుగు / వినుకొండ : తమ అవసరాలకు డబ్బు సరిపోకపోవటంతో వృద్దురాలిని హత్యచేసి బంగారు నగలను అపహరించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు తెలిపారు. వినుకొండ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 17 వ తేదిన వినుకొండ పట్టణంలోని కొత్తపేట లో కొప్పరపు సావిత్రి అనే వృద్దురాలు హత్య కేసులో దర్యప్తు చేపట్టగా నిందితులైన కట్టెంపూడి సాంబయ్య, ఆవుల మంగమ్మ ల మధ్య అక్రమ సంబంధం ఉందని, ఇరువురు తమ అవసరాలకు డబ్బులు సరిపోక పోవటంతో ఒంటరి మహిళలే లక్ష్యంగా ఈ హత్య చేసి, మృతురాలి ఒంటి పై వున్న ఒక బంగారు నాను తాడు, ఒక లక్ష్మి దేవి ఉంగరం, ఒక అకుపచ్చరాయి ఉంగరం, ఒక సదా ఉంగరం అపహరించినట్లు విచారణలో తేలిందన్నారు. కాగా నిందితులిద్దరూ వినుకొండ మండలం పెద్ద కంచర్ల గ్రామానికి చెందిన కట్టెంపూడి సాంబయ్య. ఆవుల మంగమ్మ. సాంబయ్య ఆటో నడుపుతూ ఉంటాడు మంగమ్మ వినుకొండ పలు గృహాలలో ఇంటి పని చేస్తూ ఉంటుంది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడి ఆర్థిక భారాలతో మహిళను హత్య చేసి నగలు దొంగిలించినట్టు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకొని కేసును త్వరితగతిన పరిష్కరించిన పట్టణ సి. ఐ శోభన్ బాబు, రూరల్ సి.ఐ ప్రభాకర్ తో పాటు సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్. పి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించి నట్టు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. (Story : మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు)