మాజీ మున్సిపల్ చైర్మన్ కి రావుల పరామార్ష
పలువురు ముస్లిం పెద్దలకు రావుల రంజాన్ పండుగ శుభాకాంక్షలు.
న్యూస్‌తెలుగు/వనపర్తి :పట్టణములో మాజీ ఎంపి రావుల చంద్రశేఖరరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స తీసుకోని విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మున్సిపల్ చైర్మన్ బి.లక్ష్మయ్య ని వారి స్వగృహంలో కలుసుకొని రావుల చంద్రశేఖరరెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం పెద్దలు సయ్యద్.అత్తావుల్లా,బాబర్(హరుణ్ రషీద్) గార్ల ఇంటికి వెళ్లి వారిని సన్మానించి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల.అశోక్,బండారు.కృష్ణ, ఉంగ్లాం. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,బీచూపల్లి యాదవ్,డాక్టర్. డ్యానియాల్, నందిమల్ల.రమేష్,ఎం.డి.గౌస్,వహీద్,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.(Strory : మాజీ మున్సిపల్ చైర్మన్ కి రావుల పరామార్ష)