ఐటీ టవర్ నిర్మాణం కోసం స్థలానికి సంబంధించి సర్వే చేసి నివేదిక సమర్పించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలానికి సంబంధించి సర్వే చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నాగవరం శివారులో ఐటీ టవర్ నిర్మాణం కోసం ఇదువరకు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. సంబంధిత స్థలం ఐటీ టవర్ నిర్మాణానికి అన్ని విధాలుగా అనువైనదేనా కాదా అనే విషయంపై పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఐటీ టవర్ నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలానికి సంబంధించి మరోసారి సర్వే చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, సర్వే అధికారులు, తదితరులు ఉన్నారు. (Story : ఐటీ టవర్ నిర్మాణం కోసం స్థలానికి సంబంధించి సర్వే చేసి నివేదిక సమర్పించాలి)