మాజీ గవర్నర్ నరసింహన్ ని కలిసిన కెటిఆర్ బృందం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తమిళనాడు పర్యటనలో ఉన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.ఆర్ గారితో కలసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నరసింహన్ గారు చేసిన సేవలు మరియు నేడు తెలంగాణల్లో ఉన్న పరిస్థితులను ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం కె.టి.ఆర్ ,ఎం.పి వద్దిరాజు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎం.పి వినోద్ కుమార్,ఎం.ఎల్.సి శంభిపూర్ రాజు నరసింహన్ దంపతులను సత్కరించి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామీ విగ్రహాన్ని బహుకరించారు అని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు. (Story : మాజీ గవర్నర్ నరసింహన్ ని కలిసిన కెటిఆర్ బృందం)