Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి

గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి

0

గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి

న్యూస్ తెలుగు/ సాలూరు :  కొట్టియా వివాదాపద సరిహద్దు గ్రామాల పైన ఒడిస్సా ప్రభుత్వం అధికారులు గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు రక్షణ కల్పించాలని
సిపిఎం పార్టీ సాలూరు మండల కమిటీ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాలు తరబడి ఒడిస్సా ఆంధ్ర సరిహద్దులో కొట్టియా సరిహద్దు గ్రామాల సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయకపోవడం వలన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2024 సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన సెంబి గ్రామం వద్ద మైనింగ్ పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న భూములు పైన ఒడిస్సా ప్రభుత్వం అధికారులు దౌర్జన్యం చేశారని అన్నారు. ఆ సందర్భంలో గిరిజనులందరూ ఎదురు తిరిగి తిప్పి కొట్టారని తెలిపారు. మరలా ఈరోజు ఒడిస్సా ప్రభుత్వం అండతో పోలీసు బలగంతో ఎగువ సెంబి గ్రామానికి చెందిన తాడంగి సన్నం తదితరులు భూములు పైన మైనింగ్ కోసం అధికారులు దౌర్జన్యం చేస్తూ సరిహద్దు రాళ్లు వేయడం భూమి పూజలు చేయించడం సరికాదని తెలిపారు. గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లోకి గిరిజనుల వెళ్లి ఒడిస్సా అధికారులను పోలీసులను నిలదీయగా గిరిజనుల పైన దౌర్జన్యం చేస్తూ ఇక్కడ ఏమీ చేయడానికి లేదు ఈ భూముల్లోకి రాకూడదు అని బెదిరించడం ఫోన్ లాక్కోవడం సరికాదని తెలిపారు. ఈ ప్రాంతమంతా ఐదో షెడ్యూల్ గ్రామాలుగా ఉన్నాయని సర్వహక్కులు స్థానిక గిరిజనులకే చెందుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎటువంటి హక్కు లేదని తెలిపారు. అడ్డుకోని రక్షణ కల్పించవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి స్పందించకుండా ఉండడం సరికాదని తెలిపారు ఇప్పటికైనా గిరిజనులకి రక్షణగా అండగా ఉండాలని డిమాండ్ చేశారు. కొట్టియా సరిహద్దు వివాదం పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు గిరిజనుల పైన దాడులకు దిగడం ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో ఆందోళన పోరాటాలకి గిరిజనులు సిద్ధమవుతారని తెలిపారు. (Story : గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version