Homeవార్తలు ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..

 ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..

 ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. చిత్రాన్ని  ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో …

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మాట్లాడుతూ ‘‘ ‘L2E: ఎంపురాన్’ జర్నీ అనేది మరచిపోలేని అనుభవం. ఇలాంటి పాన్ ఇండియా సినిమాను రూపొందించటానికి మా ప్రయాణం ఏడేళ్లుగా కొనసాగుతోంది.  ‘L2E: ఎంపురాన్’ వంటి భారీ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించార పృథ్వీరాజ్. తనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. దీన్ని సినిమా అని చెప్పటం కంటే మా చెమట, రక్తం అని చెప్పొచ్చు. ఇదొక ట్రయాలజీ మూవీ. అందులో ఇప్పటికే లూసిఫర్ సినిమా వచ్చింది. మార్చి 27న  ‘L2E: ఎంపురాన్’ రానుంది. మరో సినిమాను రూపొందించాల్సి ఉంది. సినిమానే మాట్లాడుతుంది. సముద్రంలాంటి సినిమాను రూపొందించాలని అనుకున్నాం. అది దీంతో నేరవేరింది. మనం నమ్మశక్యం కానీ గొప్ప సినిమాలను రూపొందించగలం. మలయాళ సినీ ఇండస్ట్రీ వస్తోన్న తొలి ఐమ్యాక్స్ ఫార్మేట్ మూవీ ఇది. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ మూవీలో మ్యాజిక్ ఉంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సినిమాను చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ  సినిమాను ఆడియెన్స్‌తో కలిసి చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా ఓ సినిమాను తెరకెక్కించటం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా పని ఉంటుంది. చాలా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా  ‘L2E: ఎంపురాన్’ వంటి సినిమాలను చేయటం మామూలు విషయం కాదు. లూసిఫర్ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించాలనుకున్నప్పుడు తొలి భాగం మంచి విజయాన్ని సాధించింది. రెండో భాగానికి సంబంధించిన ఆలోచన మాత్రమే నా మదిలో ఉండింది. దీన్ని కేవలం ఓ మలయాళం సినిమాగా రూపొందించాలనుకోవటం ఛాలెంజింగ్‌గా ఉండింది. కథకు కావాల్సిన కాన్వాస్,సినిమాకు అవసరమైన స్కేల్ అసాధారణంగా ఉండింది. 2022లో మోహన్ లాల్ గారిని ఆయన ఆఫీసులో కలిసి తొలిసారి  ‘L2E: ఎంపురాన్’కు సంబంధించిన నెరేషన్ ఇచ్చాను. ఆ సమయంలో ఇది జరిగే ఛాన్సులు సగం మాత్రమే ఉన్నాయని నా మనసులో ఆలోచనగా ఉండింది. అయితే మోహన్ లాల్ గారు కథ విని, చాలా బావుంది. ఈ సినిమాను మనం చేస్తున్నాం అన్నారు. ఆ నమ్మకమే నన్ను ఇంత వరకు నడిపించింది. నిర్మాతలు  ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ మాకు అండగా నిలిచారు. మా కథను నమ్మి అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. దేశంలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్ అయిన అనీల్ తడాని ముందుకు వచ్చారు. దాని వల్లే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్పగా చూపించే అవకాశం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తుండ‌గా ..క‌ర్ణాట‌క‌లో ప్ర‌ముఖ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నాం. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం నాకు అండగా నిలబడింది. అందువల్లనే ఈ సినిమాను అనుకున్న దానికంటే గొప్పగా చిత్రీకరించాం.
ఈ కార్యక్రమంలో ఏఏ ఫిల్మ్స్ అధినేత అనీల్ తడాని, నిర్మాత గోకులం గోపాలన్, ఇంద్రజీత్, రైటర్ మురళీ గోపి, మంజు వారియర్ తదితరులు పాల్గొన్నారు. (Story :  ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!