Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న కూటమి ప్రభుత్వం.. పొన్నవోలు

వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న కూటమి ప్రభుత్వం.. పొన్నవోలు

0

వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న కూటమి ప్రభుత్వం.. పొన్నవోలు

న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తూ ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో హింసించడం దారుణమని, రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. వినుకొండ వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన అంత వైసిపి నాయకులు కార్యకర్తలపై దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టించడం పనిగా పెట్టుకుందాం. వినుకొండలో అతి కిరాతకంగా రషీద్ హత్య జరిగితే నిజమైన ముద్దాయిలను కేసులో చేర్చలేదని, వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే నేటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని ఎద్దేవ చేశారు. ఈపూరు మండలం బొమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం పథకాలు ఇవ్వలేదని వెటకారంగా మాట్లాడి ప్రశ్నించినందుకు గురువారం వేకుజామున ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో వచ్చి మిరపకాయ కళ్ళంలో పనిచేస్తున్న రైతు నాగేశ్వరరావును బలవంతంగా స్టేషన్కు తీసుకువెళ్లి నిర్బంధించడం, భార్య సునీత కుటుంబ సభ్యులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన భర్త నాగేశ్వరావుని చూపాలని అడిగితే తీసుకురాలేదని పోలీస్ హై డ్రామా ఆడడం, స్టేషన్లో కాకుండా నాగేశ్వరావును పక్కన ప్రైవేట్ రూమ్లో పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ద్వారా తెలుసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము లీగల్ గా నాగేశ్వరావుని విడిచి పెట్టాలని హైకోర్టును ఆశ్రయించడంతో గురువారం మధ్యాహ్నం వదిలిపెట్టారని తెలిపారు. నాగేశ్వరరావు చెప్పిన దాంట్లో ఎటువంటి బూతులు లేవని, వెటకారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని చట్టవిరుద్ద చర్యలకు పాల్పడిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న హింసలకు వైసిపి నాయకులు కార్యకర్తలు భయపడరని, పార్టీ వారికి అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైసీపీ శ్రేణులపై దాడులు దుర్మార్గాలు జరిగితే వైసిపి అండగా నిలిచి తీవ్రంగా ప్రతిఘటిస్తుందన్నారు. నేడు ఎన్ డి ఏ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు విధానాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తే రాష్ట్రంలో టిడిపి ఉండేదా అని ప్రశ్నించారు. పాలన వదిలేసి కూటమి నాయకులు ప్రజల ఆస్తులను కబ్జాలు చేయటం, ప్రశ్నించిన వారిపై దాడులు అక్రమ కేసులు పెట్టడం, దుర్మార్గాలు పాల్పడుతుందని పోన్నవోలు తీవ్రంగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వకుండా ప్రజలకు అన్యాయం చేసి ప్రశ్నించేవారు ఉండకూడదు అంటూ ఇటువంటి దారుణాలకు ఓడి కడుతుందని విమర్శించారు. వైసీపీ కార్యకర్త నాగేశ్వరరావు వాస్తవాలు మాట్లాడడం వలనే పోలీసులు చేత అక్రమంగా నిర్బంధించారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పాలన పక్కన పెట్టి వైసిపి కార్యకర్తలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గంలో వైసిపి నాయకులు కార్యకర్తలకు తాను అండగా నిలుస్తానని, కూటమి నాయకుల దుర్మార్గాలు, దాడులు అక్రమ కేసులు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైసిపి పల్నాడు జిల్లా లీగల్ సెల్ నాయకులు అనురాధ, జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్ ప్రసాదు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. (Story : వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్న కూటమి ప్రభుత్వం.. పొన్నవోలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version