ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ స్థలంగా మారిన వినుకొండ ఆర్టీసీ బస్టాండ్
న్యూస్ తెలుగు/వినుకొండ : వివిధ పనులపై ఆర్టీసీ బస్టాండ్ కు వస్తున్న ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను ఎక్కువసేపు అక్కడే ఉంచడంతో బస్టాండ్ అంతా వాహనాలతో మూసుకుపోతున్నది. దీంతో బస్సు డ్రైవర్లకు ముందుకు వెళ్లాలన్న, రివర్స్ చేసుకోవాలన్న పలు ఇబ్బందులు పడుతున్నారు. పొరపాటున ద్విచక్ర వాహనాలకు బస్సులు తగిలితే ఇక పంచాయతీలు పెట్టుకుంటున్నారు. ఇక బస్టాండ్ లోపల, బస్టాండ్ ముందు ఆర్టీసీ షాపులు అద్దెకు తీసుకున్న వారు తమ పరిధికి మించి షాపులు ముందు ఆక్రమించి బస్టాండ్ మూసుకుపోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆర్టీసీ అధికారి ఒకరు సెలవులో ఉండగా ఇన్చార్జిగా ఉన్న ఇతర డిపో అధికారి చుట్టపు చూపుగా వచ్చి పోతుంటారు. ఇక స్థానిక అధికారులు విధులకు హాజరయ్యి పూర్తిస్థాయిలో బస్టాండ్ పై అజమాయిషి చూపకపోవటంతో బస్టాండ్ గందరగోళంగా మారుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని.. ప్రతిరోజు ఇతర డిపోల నుండి వందలాది బస్సులు వచ్చి వెళుతుంటాయి అన్న విషయాన్ని గుర్తించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేసి ద్విచక్ర వాహనాలను బస్టాండ్ లో పెట్టకుండా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.(Story : ద్విచక్ర వాహనదారులకు పార్కింగ్ స్థలంగా మారిన వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ )