ప్రభుత్వ పాలనలో కొత్తసంస్కరణలకు నాంది వాట్సాప్ పాలన
అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చలో మాట్లాడిన జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ పాలనలో కొత్త సంస్కరణలకు నాంది పలికినట్లు అయిందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వాట్సాప్ ద్వారానే 400 సేవలు అందించడం ద్వారా దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై జరిగిన లఘు చర్చలో జివి మాట్లాడారు. మనమిత్ర ద్వారా ప్రజలకు మంచి మిత్రులుగా సేవలు అందిస్తున్నందుకు మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. తక్కువ చదివిన వారు కూడా ఈజీగా ఆపరే ట్ చేసుకునేలా ఈ సేవలు ఉండడం అభినందనీయమన్నారు. ఇది తప్పనిసరిగా కోట్లాదిమంది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పారదర్శకత, సుపరిపాలన, అవినీతి నియంత్రణలో ఎంతో మేలు చేస్తు ందన్నారు. ఎవరు దరఖాస్తు చేసుకున్నా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వారికి న్యాయబద్ధంగా సేవలు అందుతాయన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని. ప్రజలకు వేగంగా సేవలు లభిస్తాయన్నారు. దరఖాస్తు నుంచి పరిష్కార వరకు అన్నీ నిర్ణీత సమ యంలో పూర్తి అవుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమైన పేపర్‌లెస్ గవర్నెన్స్ కూడా సాకారమై ఖర్చులు తగ్గుతాయన్నారు. ఇదే సమయంలో కుల ధ్రువీకరణలను శాశ్వతవిధానం లో అందించడం, సర్వర్లు సామర్థ్యం పెంపు, చెల్లింపుల వేగం పెంచడం, జనన ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుల గడువు పెంచడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాట్సాప్‌కే ధ్రువపత్రాలు కూడా పంపి ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలని, ఫోన్‌లో చూపినా చెల్లుబాటే అవకాశం కల్పించాలని సూచించారు.(Story :” ప్రభుత్వ పాలనలో కొత్తసంస్కరణలకు నాంది వాట్సాప్ పాలన)