పదిలమైన జ్ఞాపకం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటో సెషన్ కార్యక్రమం
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఫొటో సెషన్ కార్యకమం పదిలమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుఅన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో సరికొత్త మైలురాళ్లను ఆవిష్కరిస్తున్న శాసనసభలో భాగస్వామ్యులైన భవిష్యత్‌లకు తరతరాలకు గర్వంగా చెప్పుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా అందరికీ లభించినట్లు అయిందన్నారు. మంగళవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన ఫొటో సెషన్ కార్యక్రమంపై జివి స్పందించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్ సహా మొత్తం మంత్రివర్గ సభ్యులతో సహచర శాసన సభ్యులంతా కలసి ఒకటే ఫ్రేమ్‌లో గ్రూప్‌ఫోటోతో రాష్ట్ర అభివృద్ధి టీమ్‌ను ఒకటేసారి ప్రజలందరికీ చూపించినట్లు అయిందన్నారు. (Story : పదిలమైన జ్ఞాపకం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటో సెషన్ కార్యక్రమం)