సిపిఐ 100 సంవత్సరాల బహిరంగ సభ కరపత్రాలు విడుదల
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 23న వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మండల, పట్టణ కార్యదర్శ్ లు అబ్రహం భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అమరచింత పట్టణంలోని సిపిఐ జండా కట్ట వద్ద బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అబ్రహం, భాస్కర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిందని ఈ సంవత్సరం డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలలోకి అడుగుపెడుతుందన్నారు. ఈ 100 సంవత్సరాలలో ఉద్యమ పార్టీ గా అవతరించిందన్నారు. సీపీఐ ఈ దేశంలో జరిగిన అనేక పోరాటాల్లో పాల్గొనిందని అన్నారు. దేశ స్వాతంత్రం కొరకు జరిగిన పోరాటంలో ఆనాడే అనేకమందికి ప్రాణాలు త్యాగం చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. స్వాతంత్రం కొరకు పోరాటాలకు పిలుపునిచ్చిన ఎం.ఎన్ రాయ్, ఎస్ సి ఎ డాoగ్, నలినీ గుప్తా, చౌక ఉస్మాని వంటి మహావీరులందరూ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో నిన్న కుట్ర కేసులు ఎదుర్కొన్నారని తెలిపారు. సిపిఐ 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఈనెల 23న వనపర్తి జిల్లా కేంద్రంలో దాచర్ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జరిగే బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సిపిఐ శ్రేణులు మానవత వాదులు సిపిఐ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రవీందర్ శ్యాంసుందర్ సౌలు ఇజ్రాయిల్ తో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.(Story : సిపిఐ 100 సంవత్సరాల బహిరంగ సభ కరపత్రాలు విడుదల)