Homeవార్తలుతెలంగాణక్రీడా హబ్ గా వనపర్తి జిల్లా కేంద్రం

క్రీడా హబ్ గా వనపర్తి జిల్లా కేంద్రం

క్రీడా హబ్ గా వనపర్తి జిల్లా కేంద్రం

న్యూస్‌తెలుగు/వనపర్తి : త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రాన్ని క్రీడా హబ్బుగా ఏర్పాటు చేయనున్నట్లు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం డాక్టర్ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 68వ SGf ( cool games Federation) రాష్ట్రస్థాయి అండర్ 14 ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు విద్యార్థులు ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చునని, క్రీడాకారులందరూ గెలుపు ఓటములను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్లాలని వారు సూచించారు
వనపర్తిలో రూ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేయనున్నామని,
దీంతో విద్యార్థులకు మూడవ తరగతి నుంచి పీజీ వరకు ఉన్నత విద్య అందించవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు
రాష్ట్రవ్యాప్తంగా 35 అడ్వాన్సుడ్ ITI ఇనిస్ట్యూట్లను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా క్రీడాకారులకు తగు శిక్షణ ఇచ్చి తయారుచేయునట్లు వారు పేర్కొన్నారు. త్వరలోనే వనపర్తిలో ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. వనపర్తికి రాష్ట్రస్థాయిలోనే క్రీడాపర్తిగా గుర్తింపు వచ్చే విధంగా ఇక్కడ 50 గదులతో వసతి గృహాన్ని సైతం నిర్మిస్తామని వారు తెలిపారు. అండర్ 14 బాల, బాలికలకు నిర్వహించిన ఈ క్రీడల్లో 20 బాలికల జట్లు, 20 బాలుర జట్లు పాల్గొన్నట్లు వారూ పేర్కొన్నారు ఇందులో బాలికల్లో నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానం,
ఆదిలాబాద్ జిల్లాకు రెండవ స్థానం,
రంగారెడ్డి జిల్లాకు మూడో స్థానం లభించింది
బాలుర జట్లలో…..
మొదటి స్థానంలో హైదరాబాద్
రెండవ స్థానంలో మహబూబ్నగర్
మూడవ స్థానంలో రంగారెడ్డి జట్లు ప్రతిభ కనబరిచాయి
కి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు
కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, సమన్వయకర్త లక్కాకుల సతీష్, జిల్లా క్రీడా శాఖ అధికారులు సుధీర్ కుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, క్రీడాకారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడా హబ్ గా వనపర్తి జిల్లా కేంద్రం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!