పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శివశక్తి ఫౌండేషన్ ఫ్రిడ్జ్ వితరణ
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ ఎన్నెస్పీ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో నడుస్తున్న శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.14,600 విలువగల శాంసంగ్ ఫ్రిడ్జ్ ను విరాళంగా అందించారు. ఆదివారం ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఫ్రిడ్జ్ ను ఆస్పత్రి వైద్యురాలు పర్వీన్ బేగం, ఆరోగ్య సిబ్బందికి ఫౌండేషన్ అందజేశారు. ఆస్పత్రికి దిల్లీ నుంచి పర్యవేక్షక బృందాలు వస్తున్న నేపథ్యంలో దాతల సహకారంతో లోటు ఉన్న మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆస్పత్రి వైద్యురాలు పర్వీన్ చీఫ్ విప్ జీవీని కలసి విషయం తెలపగా వెంటనే ఫ్రిడ్జ్‌ను సమకూర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆస్పత్రి వైద్యులు సిబ్బంది చీఫ్ విప్ జీవీ, ఆయన సతీమణి శివశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జీవీ లీలావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.వి.సురేష్ బాబు, గట్టుపల్లి శ్రీను, మోటుపల్లి నరసింహారావు, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. (Story : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శివశక్తి ఫౌండేషన్ ఫ్రిడ్జ్ వితరణ)