Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ వైసీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

వినుకొండ వైసీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

వినుకొండ వైసీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు / వినుకొండ : నేడు అమరజీవి పొట్టి రాములు జయంతి సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినుకొండ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొట్టి రాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి మహాపురుషుడు. పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ప్రాతఃస్మరణీయుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్ ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజిరెడ్డి , వినుకొండ మండలం జడ్పీటీసీ రాజేశ్వరరావు , కౌన్సిలర్స్ లు, మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. (Story : వినుకొండ వైసీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments