వినుకొండ సింగర చెరువును సందర్శించిన జివి
న్యూస్ తెలుగు /వినుకొండ : రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని పట్టణ పుర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు వహించి స్వచ్ఛమైన త్రాగు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగర్ చెరువును చీఫ్ విప్ జీవి సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే జీవికి వివరిస్తూ 210 ఎకరాల విస్తీర్ణంగా ఉన్న మూడు త్రాగునీటి చెరువులను సాగర్ జలాలతో నింపామని ఈ నీరు పట్టణ ప్రజలకు మూడు మాసాలు రోజువారి సరఫరా చేసేందుకు సరిపోతుందన్నారు. అలాగే సమయం చూసుకొని చెరువును పూడికి తీత పనులు కొంచెం లోతు తవ్విస్తే అప్పుడు చెరువును సాగర్ జలాలతో నింపితే పట్టణ ప్రజలకు ఆరు మాసాల వరకు ప్రతిరోజు నీరు సరఫరా చేయవచ్చని ఎమ్మెల్యే జీవికి వివరించారు. నీటి సరఫరాపై పర్యవేక్షణ పెంచి, నీరు వృధా కాకుండా చర్యలు తీసుకొని, ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని జివి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి , పీవి సురేష్ బాబు, పి. అయూబ్ ఖాన్, షమీం, కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story : వినుకొండ సింగర చెరువును సందర్శించిన జివి)