వైకాపా మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆదేశించాలి
జగన్ అక్రమంగా దోచిన వేలకోట్లు రికవరీ చేసి ప్రజలకు ఖర్చుపెట్టాలి
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో మద్యం అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ఈడీ విచారణకు ఆదేశించాలని, జగన్ దోచుకున్న రూ.వేల కోట్లు రికవరీ చేసి ప్రజలకే ఖర్చు పెట్టాలని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చత్తీస్‌గఢ్, దిల్లీ కంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ఏపీలో మద్యం కుంభకోణం చోటుచేసుకుందన్న ఆయన, అందుకు కారణమైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రభు త్వాని కోరారు. గురువారం ఈ మేరకు అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన చీఫ్ విప్ జీవీ మద్యపాలన నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చి అదే మద్యంలో వేలకో ట్లు దోచుకున్న ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. జేబ్రాండ్‌ల మద్యంతో వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలు తీశారని, అవినీతి, దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారన్నారు. ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యంపై అతి దుర్మార్గంగా వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం తాగి 40లక్షలమంది ఆస్పత్రి పాలయ్యారని, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. కొందరు ఇళ్లు, ఆస్తులు అమ్ముకున్నారని వాపోయారు. 33వేలమంది ప్రాణాలు కోల్పోయారని, ఆ విధ్వంసానికి కారణమైన వారందరిపై బెల్టు తీయాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో రూ. 3,500 కోట్లకు పైగా అవినీతికి ప్రాథమిక ఆధారాలు దొరికాయని,, ఆ దిశగా మరింతలోతుగా తవ్వాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో క్వాలిటీ మద్యం క్వార్టర్ రూ.99 ఉంటే నాడు నాసిరకం మద్యం క్వార్టర్ రూ. 230 వరకు అమ్మారని, బెల్ట్‌షాపుల్లో మళ్లీ రూ.50 అదనంగా బాదారని గుర్తు చేశారు. డిజిటల్ లావాదేవీలు అనుమతించకుండా తాడేపల్లి ప్యాలెస్‌లోకి గుట్టలుగా బ్లాక్ మనీ పోగు చేసుకున్నారని, వాటిని లెక్కపెట్టడానికే రోజుకు 29 కౌంటింగ్ యంత్రాలు, 200మం ది సిబ్బంది పని చేసేవారన్నారు. అంతర్జాతీయ బ్రాండ్లు ఉంటే నాసిరకం మద్యం తాగరని, పెద్ద బ్రాండ్లను కూడా అడ్డుకున్నారన్నారు. జే-బ్రాండ్ల మద్యం ప్రాణాంతకం అని పక్క రాష్ట్రాలు ఏపీ బ్రాండ్లను నిషేధించిన దుస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మార్చుతున్నామన్నారు. 90శాతం వరకు బెల్టు షాపులను కూడా కట్టడి చేసినట్లు తెలిపారు. అయితే నూతన మద్యం విధానంలో 20% కమిషన్ వస్తుందని టెండర్లు వేసిన వారంతా ప్రస్తుత ం ఇబ్బందులు పడుతున్నారని, ఆ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. గీత కార్మికులకు 10% కోటాతో 349 దుకాణాలు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు జివి ధన్యవాదాలు తెలిపారు. (Story : వైకాపా మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆదేశించాలి)