27న చలో విజయవాడ ను జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనిని జయప్రదం చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ నాయకులు పిలుపు నిచ్చారు. డిపో ఆవరణలోని సంఘ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘ సభ్యులు ఎం.రామసుబ్బయ్య, వి.ఆనందం మాట్లాడుతూ. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు లీవ్ ఎన్ క్యాష్మెంట్ నగదు ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుడు మరణిస్తే నామినీగా ఉన్న అతని భార్యకు జీవితాంతం పెన్షన్ చెల్లించాలి. కానీ పుట్టిన తేదీలో మార్పు జరిగిందని, పేరులో కొన్ని అక్షరాలు తేడాగా ఉన్నాయని, అనేక కారణాలు చెప్పి ఆమెకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. అందువలన నిబంధనలను సులభతరం చేసి ఆర్టీసీ రికార్డులను ఆధారం చేసుకుని పెన్షన్ చెల్లించే ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కే.హనుమయ్య, ఎస్.కే.సైదా, కే.మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.(Story : 27న చలో విజయవాడ ను జయప్రదం చేయండి )