ఐసీడీఎస్ ను నిర్వీయం చేయాలని కేంద్రం చూస్తుంది
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ సమావేశం మార్చి 12 బుధవారం రోజు అంగన్వాడి యూనియన్ వనపర్తి ప్రాజెక్టు అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐటీసీ ఐసీడీఎస్ ను నిర్వీయం చేయాలని చూస్తుంది అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం అనే చట్టాన్ని తీసుకువచ్చింది ఈ విధానాన్ని అమలు జరుగుతే ఐసిడిఎస్ స్వతంత్రంగా ఉండదు ఐసిడిఎస్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఐసిడిఎస్ వ్యవస్థ మూతపడే పరిస్థితికి దారి తీస్తుంది అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 17, 18 తేదీలలో రెండు రోజులు 48 గంటల సమ్మెకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో అంగన్వాడీలకు 18000 వేతనం ఇస్తామని ప్రకటించారు నేటికీ హామీని అమలు చేయకుండా అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చారు కానీ వారికి వేతనాలు 10 నెలలుగా చెల్లించడం లేదని వాళ్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే 10 నెలల వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ పాఠశాలల వలె అంగన్వాడీ సెంటర్లో కూడా వేసవి సెలవులు ఇవ్వాలని వేతనాలు ప్రతినెల 1వ తేదీన చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి నారాయణమ్మ జిల్లా నాయకులు నాగేంద్రమ్మ రాజేశ్వరి శారద రేణుక లత రామచంద్రమ్మ సంగీత భారతి ఈశ్వరమ్మ విజయ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. (Story : ఐసీడీఎస్ ను నిర్వీయం చేయాలని కేంద్రం చూస్తుంది)