సమాజ నిర్మాణంలో మహిళలది ప్రధాన పాత్ర
న్యూస్‌తెలుగు/వనపర్తి : మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి.వాసంతి నిరంజన్ రెడ్డి గార్ల ఆధ్వర్యములో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల.కరుణశ్రీ అధ్యక్షతన ఘనంగా మహిళలతో కలసి ఉత్సవాలు నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మహిళా వయోవృద్దులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం బి.ఆర్.ఎస్ మాజీ మహిళా ప్రజాప్రతినిధులను వాసంతి సన్మానించారు. మహిళతో కలసి వాసంతి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిరంజన్ రెడ్డి వృద్ధులకు స్వయంగా వడ్డించి బోజనాలు ఏర్పాటు చేసారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమాజములో అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించాలి అని ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. మహిళను ప్రోత్సహించాల్సిన బాధ్యత పురుషులపై ఉన్నదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మహిళలకు ప్రాధాన్యత కలిపించి వారు స్వయంగా ఎదిగేందుకు కృషి చేశారని అన్నారు. వాసంతి మాట్లాడుతూ కె.సి.ఆర్ గారు మహిళలకు కళ్యాణ లక్ష్మి,వడ్డీలేని రుణాలు,కె.సి.ఆర్ కిట్టు ,ప్రసూతి దావఖానలు ఏర్పాటు చేసి మహిళా అభ్యున్నతికి తోడ్పద్దారని అన్నారు.
నా ఎదుగుదలలో నా భర్త నిరంజన్ రెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందని అన్నారు. మహిళల నాయకులు డాక్టర్.నిర్మల, మహిళా అధ్యక్షురాలు నాగమ్మ,నందిమ ల్ల.శారద,ప్రమీలమ్మ,సుదర్షనమ్మ,మణెమ్మ,శివమ్మ,ఈశ్వరమ్మ,గోవిందమ్మ,షేమిం మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఓడిపోవడం దురదృష్టకరం అని అభివృద్ధి ఆగిపోయిందని వాపోయారు.
రైతు బంధు,రైతు రుణ మాఫీ,ఫించన్లు ఆగిపోయి నానావస్థలు పడుతున్నారని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా మహిళల అభివృద్ధికి నిరంజన్ రెడ్డి కృషి చేశారని వారిని వచ్చే ఎన్నికలలో గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేస్తామని ప్రతిన బూనారు.
ఈ కార్యక్రమములో మాజీ ప్రజాప్రతినిధులు సంధ్య తిరుపతయ్య, ఉంగ్లమ్.అలేఖ్య,భారతి ప్రేమ్ నాథ్ రెడ్డి
జిల్లా నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల.అశోక్,వనం.రాములు,రాళ్ళ.కృష్ణయ్య,కృష్ణా నాయక్,రఘుపతి రెడ్డి,మాణిక్యం,దిలీప్ రెడ్డి,జగన్నాథం నాయుడు,గంధం.పరంజ్యోతి,చిట్యాల.రాము,గులాం ఖాదర్ ఖాన్, జోహేబ్ హుస్సేన్,బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story :సమాజ నిర్మాణంలో మహిళలది ప్రధాన పాత్ర)