ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని వినుకొండ నియోజకవర్గ మహిళా సమాఖ్య కార్యదర్శి బూదాల చైతన్య అన్నారు. శనివారం వినుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీ నందు సిపిఐ అనుబంధ సంఘం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూదాల చైతన్య మాట్లాడుతూ. స్త్రీమూర్తి గొప్పతనాన్ని వివరిస్తూ,మహిళలు సమాజంలోని అవకాశాలను అందుకుని ఆదర్శవంతంగా నిలవాలని,స్త్రీలు సంకల్పబలముతో ఏమైనా సాధించగలరని,అన్ని రంగాల్లో రాణించాలని,స్త్రీలు స్వయంకృషితో ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు స్వీట్లను పంపిణీ చేశారు. మహిళలను శాలువాలతో సత్కరించి చీరలను పంపిణీ చేశారు”.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, సుబేదార్, యూనిస్, ఎస్. కే మస్తాన్, జల్లి వెంకటేశ్వర్లు, నల్లబోతుల శ్రీనివాసరావు, లక్ష్మీ , నక్కా శ్రీదేవి, భూతమ్మ, పేరమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు)