కల్చరల్ ఫెస్ట్ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి హై స్కూల్ మరియు లీడ్ స్కూల్స్ వారు కల్చరల్ ఫెస్ట్ ను సంయుక్తంగా శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గీతాంజలి విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. చిన్నారులు మంచి నడవడికతో మరియు మంచి ఎనాలిటిక్స్ ఉన్నత స్థాయికి చేరుకొని జీవితంలో తమ లక్ష్యాలను నెరవేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తేవాలని, వారు తల ఎత్తుకొని గర్వపడేలా మన ప్రవర్తన ఉండాలని చిన్నారులకు పిలుపునిచ్చారు. మంచి అలవాటులను అలవర్చుకొని చెడును విసర్జించి పలువురికి మార్గదర్శకంగా నిలవాలి అని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి. కృష్ణవేణి, కారాస్పాండంట్ వై. లక్ష్మణ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : కల్చరల్ ఫెస్ట్ వేడుకలు)