Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బీసీ గురుకుల పాఠశాలకు శివశక్తి ఫౌండేషన్ టీవీ బహుకరణ

బీసీ గురుకుల పాఠశాలకు శివశక్తి ఫౌండేషన్ టీవీ బహుకరణ

0

బీసీ గురుకుల పాఠశాలకు శివశక్తి ఫౌండేషన్ టీవీ బహుకరణ

న్యూస్ తెలుగు /వినుకొండ : చెప్పిన మాట మేరకు స్థానిక బీసీ గురుకుల పాఠశాలల్లో వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దృష్టి పెట్టారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు కేంద్రాలుగా ఉన్న గురుకులాలకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామమన్న హామీ మేరకు వినుకొండ నరసరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల వసతిగృహానికి శుక్రవారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 అంగుళాల టీవీని బహూకరించారు. చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు తరఫున శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ జీవీ రమణారావు, మేనేజర్ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీని వసతిగృహ సిబ్బంది, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పి.ఆయబ్ ఖాన్, లాయర్ శ్రీను నాయక్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. (Story : బీసీ గురుకుల పాఠశాలకు శివశక్తి ఫౌండేషన్ టీవీ బహుకరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version