దేశంలోనే ఉత్తమ అవార్డు పొందిన లైన్మెన్ గణేష్
న్యూస్ తెలుగు / చింతూరు : చింతూరు ఎల్ ఐ కె. గణేష్ దేశంలోనే విద్యుత్ సేవలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికీ ఇచ్చే లైన్ మాన్ దివాస్ అవార్డు తో పాటు హై ఫర్ఫామింగ్ అవార్డు అయన చేసిన ఉత్తమ సేవలకు గాను దక్కించుకున్నారు.ఎపిఇపిడిసిఎల్ పరిధిలో ప్రతి ఏటాఢిల్లీలో మార్చి నాలుగో తేదీన లైన్‌మ్యాన్ దివాస్ పేరిట అత్యుత్తమ పనితీరు కనబరిచిన లైన్‌మ్యాన్లు, ఉద్యోగులను ప్రభుత్వం సత్కరిస్తోంది. ఈ క్రమంలో భాగంగా విశాఖ సర్కిల్ నుండి చింతూరుకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ గణేష్ కు చింతూరు మండలంలో వరదల సమయంలో అయన చేసిన అత్యుత్తమ సేవలు మరియు 22 సంవత్సరాల తన సర్వీసులో చేసిన ఉత్తమ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఉత్తమ సేవకులుగా గుర్తించి లైన్ మాన్ దివాస్ అవార్డు తో పాటు హై ఫర్ఫామింగ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. గణేష్ 2003 జేఎల్ఎం గా చర్ల లో పోస్టింగ్ పొంది,2008 అసిస్టెంట్ లేన్ మాన్ గా చింతూరు లో సేవలు అందించి 2010లో లైన్మాన్ గా కూనవరం ఉద్యోగున్నతి పొంది 2018 లైన్ ఇన్స్పెక్టర్ నెల్లిపాక తర్వాత మళ్ళీ చింతూరులో ఉత్తమ సేవలు అందించారు.అయన చేసిన ఉత్తమ సేవకుగాను దివాస్ అవార్డు కు ఎంపికైనారు. అవార్డు పొందిన గణేష్ ను ఉన్నత విద్యుత్ అధికారులు చింతూరు సబ్‌స్టేషన్ ఎ డి,ఎఇ,సబ్ ఇంజినీర్, ఇతర అధికారులు విద్యుత్ ఉద్యోగులు చింతూరు ప్రజలు అభినందించారు. (Story : దేశంలోనే ఉత్తమ అవార్డు పొందిన లైన్మెన్ గణేష్)