కమిషనర్,టిపిఓ,సబ్ రిజిస్టర్ లను వెంటనే సస్పెండ్ చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న భూ కబ్జాలకు తొత్తులుగా మారిన మున్సిపల్ కమిషనర్,టిపిఓ,సబ్ రిజిస్టార్లను తక్షణమే సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా నేత ఏ.భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక ఆందోళన ఆరు రోజు మంగళవారం కూడ కొనసాగింది. సిపిఐ నిరవధిక ఆందోళనకు జిల్లా అధికార యంత్రాంగం కదులుతుంది.జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణం నిర్మాణం ఆపాలని కలెక్టర్ ఆదేశాల మేరకు బాబా కాలనీలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీను రోడ్డుపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రదేశానికి మున్సిపల్ అధికారులు వెళ్లి అక్రమ కట్టడా నిర్మాణాన్ని ఆపి జిల్లా కలెక్టర్ కి అక్కడి ఫోటోలు పంపారు.అధికారులు వెళ్లిపోయిన తర్వాత అక్రమ నిర్మాణ పనులు మళ్లీ కొనసాగడం కోసం మెరుపు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నేత ఏ. భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలోని బాబా కాలనీకి అడ్డంగా నిర్మిస్తున్న టీఎన్జీవో బిల్డింగ్ పక్కల గల 20 ఫీట్ల రోడ్డు కబ్జాకు కారకులైన బంగారు శ్రీనివాసులకు సహకరిస్తున్న ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్,టి పి ఓ.సబ్ రిజిస్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అనేక వెంచర్ల లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 10% భూములను మాజీ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కొంతమంది సిండికేట్ గా అవతారం ఎత్తి కబ్జాలకు పాల్పడ్డారని అందుకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ప్రజా ఉద్యమం జరుగుతుందని ఈ కబ్జాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు మాట్లాడుతూ:- కబ్జాదారులు ఎంతటి వారినైనా ఎన్ని రోజులైనా ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెట్టుతామని అంతవరకు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి , ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మోష, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా కార్యదర్శి గీతమ్మ ,సౌలు, లక్ష్మీనారాయణ, కుమార్, శేఖర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు. (Story : కమిషనర్,టిపిఓ,సబ్ రిజిస్టర్ లను వెంటనే సస్పెండ్ చేయాలి)