ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని, పర్మినెంట్, కాంట్రాక్టు,కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వినుకొండ పట్టణంలో శనివారం నాడు శివయ్య భవన్లో జరిగిన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశానికి సంపెంగుల అబ్రహం రాజు, మురికిపూడి నాసరయ్య అధ్యక్షత వహించగా సమావేశంలో ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు మారుతీ వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు దశల వారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శివయ్య భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని సమావేశానికి మున్సిపాలిటీలో పనిచేయుచున్న అన్ని రంగాల కార్మికులు మద్దతునిచ్చిన కార్మిక సంఘాలు పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు తెలియజేసి మూడో తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలోనూ ఆరో తేదీన విజయవాడ లో జరగనున్న ధర్నాలోనూ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకోరారు. ముఖ్యంగా ఆప్కాస్ విధానాన్ని తొలగించి కార్మికులను కాంట్రాక్టు విధానం లోకి మార్చి కాంట్రాక్టు విధానాన్ని తీసుకుని వచ్చుటకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మున్సిపల్ కార్మికులకు ఉద్యోగులకు ఆప్కాస్ విధానంలోనే వేతనాలు ఇచ్చే విధానాన్ని మున్సిపాలిటీ ద్వారా అథారిటీగా చెల్లింపులు జరగాలని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలను గత సమ్మె కాలంలో అయిన ఒప్పందం మేరకు అమలు చేయాలని కనీస వేతనాలు వెంటనే పెంచి అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న డి ఏ లను ఎంకేష్మెంట్ లీవ్ సరెండర్ లీవ్ ల కు వేతనాలు ఇవ్వాలని పెరిగిన జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలకు కార్మికులను పెంచాలని వారు డిమాండ్ చేశారు. మార్చి మూడో తేదీ కలెక్టర్ ఆఫీస్ వద్ద మార్చి ఆరో తేదీ విజయవాడలో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని కోరుకోరారు. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘం నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము, కె. మల్లికార్జున రావు,పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మిక సంఘం నాయకులు అబ్రహం రాజు శామంతపూడి సాయి బాబు, రేవల్ల శ్రీనివాస రావు, షేక్ నాగూర్ వలి, పచ్చి గొర్ల యేసు, రాచపూడి ఏసు పాదం, కంచర్ల కోటేశ్వరరావు, పెద్దిటి స్వామి, పఠాన్ ఫిరోజ్ ఖాన్, రామకృష్ణ, రవి, రాముడు, లక్ష్మయ్య, సంజీవయ్య, ఉప్పు శ్రీను, వేల్పుల కోటేశ్వరమ్మ, కావలకుంట కుమారి, మొగిలి లక్ష్మమ్మ, ఖాశింబి, అహ్మద్వలి, షేక్ ఖాసిం, నాగరాజు, బళ్లాని శ్రీను, ఉప్పలపాటి డేవిడ్, ఆంధ్రా అల్లూరయ్య సంపెంగుల మోషే తదితరులు పాల్గొన్నారు. (Story : ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి)