అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చివేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు మూడవ రోజు నిరవధిక నిరసన కొనసాగింది. ఈ ఆందోళన శిబిరాన్ని కి రవీందర్ అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు అబ్రహం మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో 10% భూమి నీ భూకబ్జాదారుల నుండి ప్రభుత్వం గుర్తించి వెలికి తీయాలని అన్నారు. అదేవిధంగా టీఎన్జీవో బిల్డింగ్ పక్కల గల 20 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతున్నదని అందుకు కారకులైన బంగారు వ్యాపారస్తుడు బంగారు శ్రీను పై వెంటనే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అందుకు సహకరించిన మున్సిపల్ కమిషనర్, టి పి ఓ ,లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని భూ కబ్జాలపై మున్సిపల్ శాఖ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ మాట్లాడుతూ మూడు రోజులుగా తాహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ఏర్పాటు చేసిన నేటి వరకు అధికారులు స్పందించడం లేదని చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఏఐటియూసి బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ మాట్లాడుతూ:-బంగారు శ్రీను బాగోతం అవినీతిమయంగా ఉందని రోడ్లు కబ్జా , కబ్రస్తాన్లను భూకబ్జాలకు పాల్పడుతూ ఉంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు సిపిఐ పార్టీ ఇచ్చిన పిలుపునకు కార్మిక సంఘంగా సంపూర్ణ మద్దతిస్తున్నామని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సమస్యని పరిష్కరించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు మాట్లాడుతూ:-భూ కబ్జాల బాగోతం బయటపెట్టి భూకబ్జాదారులక్షర వీడే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఏ భాస్కర్, మోష,ఎన్ ఎఫ్ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి గీతమ్మ, నిస్సార్, సౌలు , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.(Story : అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చివేయాలి)