మోడాల సుజాత సేవలు చిరస్మరణీయం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ ఆరోగ్య పర్యవేక్షణ అధికారిగా, మోడాల కవిత (సుజాతాదేవి) వైద్య, సామాజిక సేవలు చిరస్మరణీయం అని వనపర్తి ఆర్ఎంఓ శివప్రసాద్ అభినందించారు. వనపర్తిలో శుక్రవారం ఆమె ద్వితీయ వర్థంతి వేడుకలు, కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. రోగులకు పండ్లు పంచి పెట్టారు. అనాధలకు అన్నదానం చేసి, అమెకు నివాళి అర్పించారు. సుజాతాదేవి భర్త, పాత్రికేయ, ధ్యాన, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ మోడాల చంద్రశేఖర్, కూతురు హౌస్ సర్జన్ డాక్టర్ మోడాల రచన ఆద్వర్యంలో చేయూత అనాధ ఆశ్రమంలో బాలలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు విట్టా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో, ఉన్నత వైద్యాధికారులు ఆర్ఎంఓ శివ ప్రసాద్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి సుధారాణి ఆద్వర్యంలో, రోగులకు పండ్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వారు సుజాతాదేవి చేసిన వైద్య, సామాజిక సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హౌస్ సర్జన్ లు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ సందేశ్, పాత్రికేయులు మల్యాల బాలస్వామి, శివ, సామాజిక కార్యకర్త సాయికుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : మోడాల సుజాత సేవలు చిరస్మరణీయం)