మంచుగడ్డ లో వినుకొండ పరుగుల వీరుడు
అబ్దుల్లా విజయపతాకం..
న్యూస్ తెలుగు/ వినుకొండ : 0.30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్ పందెంలో, ప్రతీకూల వాతావరణం మరియు అలవాటు లేని ప్రాంతం లో అనారోగ్యం పాలైనా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా భారతదేశం నుండి పాల్గొన్న 80 మంది లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ వాసి పరుగుల వీరుడు గా పేరొందిన షేక్. అబ్దుల్లా గడ్డ కట్టిన మంచుపై 42 కిలోమీటర్లను 06 గంటలలో పూర్తిచేసి మెడల్ సాధించారు. ఈ పోటీ కోసం భారత, చైనా సరిహద్దు ప్రాంతమైన లడ్డక్ లోని ప్యాంగంగ్ చెరువు (మంచుపై) ఫిబ్రవరి 15 నుండి 26 వరకు అక్కడే ఉండి ఎంతో వ్యయ, ప్రయాసలకు ఓర్చి అబ్దుల్లా విజయం సాధించారు. ఈ పతకం సాధించడానికి ఆర్ధికంగా, మానసికంగా సహాయ, సహకారాలు అందించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ అహ్మద్ ని మరువలేనన్నారు. అలాగే సిమ్స్ కళాశాల తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్టర్ భీమనాదం భరత్ రెడ్డి, గుంటూరు పట్టణ డాక్టర్ల సంఘం అధ్యక్షులు సాయి కృష్ణ (ప్రతిమ నర్సింగ్ హెూమ్,) గుంటూరు నగర తూర్పు డిఎస్పి అజీజ్ మరియు గుంటూరు నగర బులియన్ మర్చంట్స్ అధ్యక్షులకి మరియు విశ్రాంత ఉద్యోగి, టీడిపి నాయకులు మహమ్మద్ కరీముల్లా, షేక్ అప్సర్ లకు అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు.(Story : మంచుగడ్డ లో వినుకొండ పరుగుల వీరుడు)