బడ్జెట్ చాలా బాగుందిః మంత్రి సంధ్యారాణి
న్యూస్ తెలుగు/సాలూరు : రాష్ట్ర బడ్జెట్ లో గిరిజన శాఖకు మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసవ్ కు రాష్ట్ర గిరిజనులు మహిళల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్ననని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹3,22,359 కోట్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా, గిరిజన సంక్షేమశాఖకు ₹8,159 కోట్లు, మహిళా & శిశు సంక్షేమశాఖకు ₹4,332 కోట్లు కేటాయించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.విద్య (31,805),
వైద్యం (19,264),
వ్యవసాయం(13,487) రంగాలకు పెద్ద పీట వేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇంతటి కష్టకాలంలో కూడా ఇంత మంచి బడ్జెట్, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన బడ్జెట్ ను తయారు చేయడం ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమని తెలిపారు. సంక్షేమాన్ని కేంద్రబిందువుగా పెట్టుకుని ప్రజల అభివృద్ధి కోసం సమతుల్యమైన బడ్జెట్‌ను రూపొందించారని అభినందించారు.గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి గిరిజన సంక్షేమశాఖకు ఈసారి గణనీయమైన నిధులు కేటాయించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతాయని తెలిపారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన, సాంకేతికత అనుసంధానం, ఉద్యోగావకాశాల పెంపు వంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు.మహిళా & శిశు సంక్షేమంపై అభినందన మహిళలు, చిన్నారుల భద్రత, అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
మహిళా సాధికారత, ఆర్థిక స్వతంత్రత, బాలికల విద్య కోసం ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు రాష్ట్రంలోని మహిళల భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తాయని ఆమె తెలిపారు.ఈ బడ్జెట్‌తో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకుని, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె అన్నారు.(Story : బడ్జెట్ చాలా బాగుందిః మంత్రి సంధ్యారాణి)