ఇక..అమరావతి సూపర్ స్పీడ్!
ఏపీ బడ్జెట్‌కు తుదిరూపు
రాజధాని, పోలవరానికి ప్రాధాన్యత
బడ్జెట్‌లో నిధుల వరద
సూపర్ సిక్స్‌కు ప్రాధాన్యత
సంక్షేమం…అభివృద్ధి సమతుల్యం
ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట
న్యూస్ తెలుగు/అమరావతి: అమరావతి రాజధాని పనులు శర వేగం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రాజధాని పనులకు సమర్థవంతంగా నిధులు కేటాయించనుంది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు ఎక్కడికక్కడే నిలిచిపోగా, కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ముమ్మరం చేసేలా ప్రణాళిక రూపొందించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజధానికి భారీగా నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ అంచనాలను తుదిదశ తీసుకొచ్చారు. ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అప్పులు చిట్టా వెరసి కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోను పరిపాలన గాడిలోకి తేవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో అప్పులకు వడ్డీలు కట్టాల్సి వచ్చిందని, దీనివల్ల సూపర్ సిక్స్, ఇతరత్రా సంక్షేమ పథకాలకు నిధులు కొరత అడ్డువచ్చిందని ఏకంగా కూటమి నేతలు చెబుతున్నారు. వాటన్నిటిని అధిగమించి ఏకంగా బడ్జెట్‌లో అమరావతి రాజధానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ రంగానికి ప్రాముఖ్యత లభించనున్నారు. ఏపీ అంటే…ఏ..అంటే..అమరావతి, పీ…అంటే పోలవరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే. ఆ మేరకు అమరావతి రాజధాని, పోలవరం పనులు పూర్తికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సాయంతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం రుణాలు సేకరించారు. ఆ రుణ నిధుల విడుదలకు మార్గం సుగమైంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇటీవల నిధులు వచ్చాయి. వాటి ద్వారా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు.
సూపర్ సిక్స్…అభివృద్ధి పనులే లక్ష్యం
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సూపర్ సిక్స్, అభివృద్ధి పనులే లక్ష్యంగా రూపకల్పన చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపుదిద్దుతున్నారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో బడ్జెట్ కసరత్తు పూర్తయింది. ప్రభుత్వంలోని కీలక శాఖలకు భారీగా కేటాయింపులు ఉంటాయి. ఈ బడ్జెట్‌కు ముఖ్య లక్ష్యం రాష్ట్ర జిఎస్‌డిపి వృద్ధి రేటు 15 శాతం సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తమ పథకాల అమలుకు తగినంత నిధులు కేటాయించడమే కాకుండా, వాటి ఆర్థిక ప్రభావాన్ని సమీక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సూపర్ సిక్స్ పథకాల అమలుకు పెద్దపీట వేసేందుకు కసత్తు చూపిస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కీలకమైనవి. ఇందులో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తుండగా..మిగిలిన వాటిని ప్రారంభించాల్సి ఉంది. అందుకు నిధుల కొరత పీడిస్తోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేసి బడ్జెట్‌లో కేటాయింపులు జరగనున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా, సంక్షేమ పథకాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అమరావతి రాజధానికి రూ.60వేల కోట్లు
అమరావతి రాజధాని అభివృద్ధిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో రూ.60వేల కోట్ల అంచనాలతో రాజధానిని పూర్తి చేయాలని లక్ష్యంగా ఉంది. దీని కోసం వరల్డ్ బ్యాంక్, ఆసియా డవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రూ.30వేల కోట్లకుగాపై రుణాలు వచ్చినట్లు సమాచారం. బడ్జెట్ గణాంకాల్లో దీనిపై స్పష్టత రానుంది. ఒక్క రాజధానే కాకుండా పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన రహదారుల అనుసంధానం, పరిశ్రమల వృద్ధి, పునరుత్పత్తి శక్తి రంగాల్లో పెట్టుబడులు బడ్జెట్‌లో ముఖ్య ప్రాధాన్యత పొందనున్నాయి. ఆర్థిక శాఖకు 28 శాఖల బడ్జెట్ సమీక్షలు పూర్తి కావడంతో, మంత్రులంతా తమ శాఖలకు అధిక నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ మాత్రమే రూ.37,000 కోట్లు కోరగా, ప్రభుత్వం రూ.27,000 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల అభివృద్ధి, తయారీ పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా ఈ బడ్జెట్‌లో అమరావతి రాజధానికి, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయిస్తారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత కల్పించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు మార్గదర్శకంగా బడ్జెట్ అంచనాలు రూపొందించనున్నారు. (Story: ఇక..అమరావతి సూపర్ స్పీడ్!)
Follow the Stories:
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
జగన్..జస్ట్ ఫైవ్ మినిట్స్! అలా వచ్చి..ఇలా వెళ్లి..!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?