మాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
జీవి ఆంజనేయులు కలసి వినతి పత్రం అందజేసిన జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్
న్యూస్‌తెలుగు/ వినుకొండ : గుంటూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ను కలిసి వినతి పత్రం అందచేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ వినుకొండ నియోజకవర్గ కమిటీ, వినుకొండ నియోజకవర్గం లోని మాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వాటిలో ముఖ్యంగా వినుకొండ పట్టణం లోని సుమారు 500 వందల కుటుంబాలకు పైబడిన మాలలు ఉన్నప్పటికీ ఇంతవరకు స్మశానం లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి స్మశాన స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరారు. అలాగే పట్టణ ప్రాంతంలో వివాహాలు, శుభకార్యములు దళితులు చేసుకునేందుకు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలని, అలాగే వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవిన్యూ లోని జాలలపాలెం పంచాయతీలో గల 175 ఎకరాల హైకోర్టులో వేసిన భూములను మరియు నూజెండ్ల మండలంలోని దాట్లవారిపాలెం గ్రామంలోని భూములను పరిష్కారం చేసి భూమిలేని నిరు పేదలకు భూమిని పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మాలలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పై వాటిపై స్పందించిన ఆయన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్, పల్నాడు జిల్లా వర్కింగ్ అధ్యక్షులు గుడిపూడి ఏసురత్నం, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు పమిడిపల్లి ఇశ్రాయేలు, పట్టణ అధ్యక్షులు రాయని చిన్న పాల్గొన్నారు. (Story : మాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి)