మున్సిపల్ కార్మికుల సమస్యలపై ధర్నా
న్యూస్ తెలుగు/ చింతూరు : కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు వారి ఏజెన్సీలకు అప్పచెప్పుదామనే మంత్రి వర్గ సభ్యుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించిన అంశం అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. సోమవారo ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖ కి ఆ బాధ్యతలు అప్పగించాలని, కనీస వేతనలు 35 వేలు చెల్లించాలని, మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లింపు, పనులు అప్పగింత నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని ఆయన కోరారు ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పగించొద్దని మధు డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ తక్షణమే చేయాలని ఆయన అన్నారు.కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లో ఎన్కోస్మెంట్ మరియు మూడు డిఏలు తక్షణమే విడుదల చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుకే గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచాలని, జనాభా ప్రతిపదికన కార్మికులను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కార్మికులకువర్తించాలని, 15 సంవత్సరాలుగా రిక్షా కార్మికులకు స్కూల్స్ స్వీపర్ల వేతనాలు పెంచలేదని, తక్షణమే వారికి వేతనాలు పెంచాలని, ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్డు ప్రస్థానంలో వారి కుటుంబ సభ్యులకు పనులు అవకాశం కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగ, కార్మికుల వలె కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగ కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, మధు డిమాండ్ చేశారు పనిముట్లు కొడతా తీర్చాలని, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, ఆప్కోస్ మరణించిన కార్మిక కుటుంబాలకు ఉద్యాగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ,ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరావు,
ఏ ఐ వై ఫ్ జిల్లా కార్యదర్శి టీ త్రిమూర్తులు, యూనియన్ అధికారబడి ధనాల దుర్గమ్మ, బంగారు గిరిబాబు, గుడుపు గిరి, నంద కిషోర్, ముత్యాల మురళి, శారద, పోలమ్మ, అల్లం బాలు, శ్రీనివాస్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపల్ కార్మికుల సమస్యలపై ధర్నా )