Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యువతే దేశానికి వెన్నెముక

యువతే దేశానికి వెన్నెముక

0

యువతే దేశానికి వెన్నెముక

అన్ని రంగాల్లో ముస్లిం యువత ముందుండాలి

దేశాభివృద్ధికి తోడ్పడాలి

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్

న్యూస్ తెలుగు/ చింతూరు : భారతదేశంలో 30% ఉన్న ముస్లిం యువత విద్యలో వెనుకబడి ఉన్నారని ఎందరో యువకులు ప్రాథమిక విద్య నుండే డ్రాప్ ఆర్ట్స్ అవుతూ కుటీర పరిశ్రమలు వెల్డింగ్ షాపులు టైర్ కోట్లు. చికెన్ మటన్ షాపుల్లో పనిచేస్తూ యువశక్తి నిర్వీర్యం అవుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సీట్ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ అన్నారు.. రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా రాజమహేంద్రవరంలో జాంపేట సెంటర్లో మైనార్టీ ఐడియల్ యూత్ మూమెంట్ వారు ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఉన్నారు.. యువత తన మేధస్సును దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని ఉన్నత చదువులను అభ్యసించి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువలను పెంచాలని భిన్నత్వంలో ఏకత్వం గా ఉన్న భారతదేశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలె మతసామరస్యంతో మెలిగేలా ప్రతి ఒక్కరు అంకిత భావం కలిగి ఉండాలన్నారు. అనంతరం రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆ
దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా ముస్లిం యువత కేవలం రంజాన్ పండుగకే పరిమితం కాకుండా హిందువుల పండుగలలో కూడా పాల్గొని ఉత్సాహంగా ఊరేగింపుల్లో పాల్గొంటూ మతసామరస్యానికి మారుపేరుగా నిలుస్తున్నారని రంజాన్ పండుగ పర్వదిన ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన మైనార్టీ ఐడీఎల్ యూత్ మూమెంట్ వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంజాన్ ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని 30 రోజులు లేకపోయినా కనీసం మూడు రోజులు తాను ఉపవాసం రంజాన్ నెలలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం మసీదు మౌజనులకు రాష్ట్రవ్యాప్తంగా 47 వేల కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర మైనారిటీ సలహాదారు మాజీ ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తమ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతుందని ముస్లిం యువత క్రీడల్లో విద్యలో రాణించాలని మతసామరస్యాన్ని కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం విన్నర్స్ 20వేల రూపాయలు, రన్నర్ కు 15 వేల రూపాయలు నగదు మరియు క్రీడాకారులకు మెడల్స్ , మరియు ట్రోపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవై ఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా, జమాతే ఇస్లామి ఆర్గనైజర్ సిద్దిఖి, సయ్యద్ ఉమర్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఆర్గనైజర్ చాంద్ భాష, నూర్ భాషా అధికార ప్రతినిధి సుభహాన్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ జానీ, ఆర్ జె వై మైనార్టీ సెల్ ఎస్కే అహ్మద్ ఎస్కే బషీర్, జిల్లా నాయకులు అజీజ్ తదితరులు పాల్గొన్నారు. (Story : యువతే దేశానికి వెన్నెముక)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version