గవర్నమెంట్ కాలేజ్ లో అడ్మిషన్ పొంది..ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ పట్టు
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు. సి కృష్ణయ్య, ఎన్ కృష్ణకుమారి, కె శిల్పా, ఎం నవీన్ కుమార్ వచ్చే విద్యా సంవత్సరానికి తమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ బాగా పెంపొందించడానికి తమ వంతు కృషి చేస్తూ, జిల్లా ఉన్నత బాలికల పాఠశాల పెబ్బేరుకు సందర్శించడం జరిగింది.
ఆ పాఠశాల 10వ తరగతి విద్యార్థినీలతో తెలుగు అధ్యాపకురాలు ఎన్ కృష్ణకుమారి మాట్లాడుతూ, కళాశాల అన్ని రకాల క్లాస్ రూమ్స్ మంచి వసతులతో కూడుకొని ఉన్నదని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన తరగతి గదులతో, విద్యార్థులు మానసికంగా ఎదగడానికి ఆటలు ఆడుకోవడానికి విశాలమైన క్రీడమైదానంతో, కళాశాలకు అలంకారణంగా నిలిచిన పూల మొక్కలు చెట్ల మధ్యన, కళాశాల నిర్మితమై ఉన్నదని, అన్ని సబ్జెక్టుల లెక్చరర్స్ ఉన్నారని, మీరు పదవ తరగతి మార్చ్ లో జరగబోయే పరీక్షలో బాగా రాసి మంచి మార్కులు సాధించి,మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పొందవలసిందిగా ఆ విద్యార్థినీలకు సూచించడం జరిగింది. మా కళాశాలలో చేరిన విద్యార్థులకు, సబ్జెక్ట్స్ బోధనతోపాటు, అన్ని రకాల పోటీ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని తెలియజేశారు. మా ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులకు జేఈఈ, మెయిన్స్ , నీట్ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి కృష్ణయ్య, ఎన్ కృష్ణకుమారి, కె శిల్ప, ఎం నవీన్ కుమార్ పాల్గొన్నారు. (Story : గవర్నమెంట్ కాలేజ్ లో అడ్మిషన్ పొంది..ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ పట్టు)