కిటకిటలాడిన చేపల దుకాణాలు
రోడ్లపైనే వాహనాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రస్తుతం ప్రజలంతా బ్రాయిలర్ చికెన్ తిని ఆనారోగ్య పాలవడం కంటే చేపలే శ్రేష్టమని అభిప్రాయప డుతున్నారు. దీంతో పట్టణంలో రింగ్ రోడ్డు ,రాజీవ్ నగర్ కాలనీ,అర్అండ్ రైతుబజార్,. గంటస్తంభం మార్కెట్లోని చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. చేపల ధరలు కూడా అధికంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోందని పలువురు మాంసాహారులు అంటున్నారు. మంగళవారం సాధారణ సమయంలో 150 ,160 ఉండే చేపల ధర ఒక్కసారిగా 200 దాటింది అలాగే మటన్ షాపుల వద్ద జనం క్యూలైన్లలో ఉండడం కనిపిస్తోంది.
ఇక రింగ్ రోడ్డు రాజీవ్ నగర్ కాలనీ వద్ద ఉన్న చేపల మార్కెట్ రోడ్లపైనే ఉండడంతో ఆయా రోడ్లు రద్దీగా మారాయి. మార్కెట్కు వచ్చిన కొనుగోలుదారులు రోడ్లపై వాహనాలు నిలపడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాలు వచ్చే సమయంలో అయితే ట్రాపిక్ తీవ్రంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ వాహనాలు నిలుపుదల చేయకుండా సమస్యను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులను పలువురు కోరుకుంటున్నారు.ఇక రాజీవ్ నగర్ కాలనీ వాసులైతే ఇక్కడ మార్కెట్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ వాపోతున్నారు. (Story : కిటకిటలాడిన చేపల దుకాణాలు)