అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నారు
న్యూస్ తెలుగు/ సాలూరు : చంద్రబాబు నాయుడు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సాలూరు పట్టణానికి చెందిన 4వ వార్డు, 5వ వార్డు సుమారు 100 వైయస్సార్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ చేస్తున్న సేవలను గుర్తించి పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ టీడీపీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. (Story : అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నారు)